పశ్చిమ గోదావరి జిల్లా : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం బస ప్రాంతం నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొల్లపర్రుకు చేరుకున్నాక భోజన విరామం ఉంటుంది. సాయంత్రం ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. చివరగా అజ్జుమూరులో శుక్రవారం రాత్రి పాదయాత్ర ముగించి, రాత్రికి వైయస్ జగన్ అక్కడే బస చేస్తారు. <br/>