పాపకు ‘విజయమ్మ’గా నామకరణం

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన బిడ్డకు ‘విజయమ్మ’ అని నామకరణం చేశారని గుత్తి నియోజకవర్గానికి చెందిన రవి, లత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలుసుకున్న రవి, లత దంపతులు తమ నాలుగు నెలల పాపకు నామకరణం చేయాలని వైయస్‌ జగన్‌ను కోరారు. దీంతో పాపను చేతుల్లోకి తీసుకున్న జగన్‌ విజయమ్మ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కుటుంబం అంటే ఎనలేని అభిమానం అని, జననేత వస్తున్నాడని తెలిసి గుత్తి నియోజకవర్గానికి వచ్చామని, ఆయన మా పాపకు విజయమ్మ అని పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
Back to Top