శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 316వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం ఫరీదు పేట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కుశాలపురం, బైపాస్ జంక్షన్, పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్, గుజరాతి పేట, నాగావళి ఓల్డ్ బ్రిడ్జ్ మీదుగా శ్రీకాకుళం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం శ్రీకాకుళం ఏడు రోడ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తారు.
వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.