<strong>శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర</strong>విజయనగరంః రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయస్‌ఆర్‌సీపీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 305వ రోజు షెడ్యూల్డ్ ఖారైంది. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం కురుపాం నియోజకవర్గం జియ్యమ్మ వలస మండలంలోని బసచేసే ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి నగురు,దట్టి వలస క్రాస్,చిలకం క్రాస్ వరుకు సాగుతోంది. మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం రావివలస క్రాస్ మీదుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కెల్లా, నడిమికెల్లా వరుకు పాదయాత్ర కొనసాగుతోంది.