జననేతతో వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారణి ఆవేదన

కృష్ణా: క్రీడాకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారణి శిరోమణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలుసుకొని తమ సమస్యలను చెప్పుకున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కొంత మందికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంత వాసులను కించపరిచే విధంగా వ్యవహరిస్తుందన్నారు. క్రీడాకారులకు మంచి భవిష్యత్తు అందించే విధంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన ఉంటుందని, అధ్యైర్యపడొద్దని వైయస్‌ జగన్‌ ఆమెకు భరోసా ఇచ్చారు. 
Back to Top