విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను నాశనం చేశాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మాడుగుల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో విద్యార్థులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఫీజురీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అదే విధంగా ఫీజు కడితే గానీ సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీలు చెబుతున్నాయని వైయస్ జగన్‌ను కలిసి ఓ యువతి మొరపెట్టుకుంది. సర్టిఫికెట్లు లేక ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నానని కన్నీరుపెట్టుకుంది.