ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 300వ రోజు

  
  

- వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో మ‌రో కీల‌క ఘ‌ట్టం
- ఇప్ప‌టి వ‌ర‌కు 12 జిల్లాల‌లో పాద‌యాత్ర   
- జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం
విజ‌య‌న‌గ‌రం: దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎవరూ కనీవినీ ఎరగని విధంగా.. నాలుగు పదుల వయసున్న ఓ యువ నాయకుడు ఎండనకా.. వాననకా.. అలుపూసలుపూ లేకుండా.. 300 రోజులపాటు దాదాపు 3250 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేస్తూ.. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్ళు తుడుస్తూ, ఆత్మీయంగా స్పశిస్తూ, పలకరిస్తూ.. ముందుకు సాగుతున్న ఏకైక నేత, పోరాట యోధుడు, వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే.  వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆదివారం 300వ రోజు విజయనగరం జిల్లా పార్వతీ పురం నియోజకవర్గంలోని కోటవాని వలస నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బంతువాణి వలస, అడ్డపుశీల క్రాస్‌, బచి జంక్షన్‌, సీతాపురం క్రాస్‌ మీదుగా కురుపమ్‌ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తారు. ఉల్లిభద్ర, గరుగుబిలి క్రాస్‌, కే రామినాయుడు వలసక్రాస్‌, తోట పల్లి రిజర్వాయర్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది.  

ఏ నాయకుడూ, ఎప్పుడూ వెళ్లని మారుమూల గ్రామాల్లో, మార్గాల్లో సైతం జననేత అడుగులు వేస్తున్నారు. కొండలు, కోనలు, చిట్టడువుల మీదుగా ఆయన యాత్ర కొనసాగుతోంది. ఎంత కష్టం వచ్చినా, ఆరోగ్యం ఎలా ఉన్నా, ఆయన తన యాత్ర ఆపడం లేదు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం ఒక మహాయజ్ఞంలా ప్రజాసంకల్పయాత్రలో ముందుకు కదులుతున్నారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, వారి బాధలు వింటూ, వారికి ఒక భరోసా ఇస్తూ.. వారిలో ఒకరిలా, ఒక చెల్లికి అన్నగా, ఒక అక్కకు తమ్ముడిగా, ఒక తల్లికి బిడ్డగా, ఒక అవ్వకు మనవడిగా, ప్రతీ నిరుపేద కుటుంబానికి ఒక అన్నగా, ఒక పెద్ద కొడుకుగా నేనున్నానంటూ.. వైయ‌స్‌జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు.

దారుల‌న్నీ జ‌న‌సంద్ర‌మే..
వైయ‌స్ జగన్‌ అడుగులకు సంఘీభావంగా రాష్ట్రం జన ఉప్పెనై కదులుతోంది. కష్ణా జిల్లా ముఖ ద్వారమైన ప్రకాశం బ్యారేజీ మీదకు జననేత చేరుకునే సందర్భంలో జన ప్రకంపనలతో బ్యారేజీ దద్దరిల్లింది. అలానే తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశిస్తున్న సందర్భంలో గోదావరి బ్రిడ్జి జన గోదావరిని తలపింపజేసింది. ఉత్త‌రాంధ్ర‌లో అడుగుపెట్ట‌గానే ఉప్పెన‌లా జ‌నం పోటెత్తారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇవాళ 300 రోజుల మైలురాయిని చేరింది.  జననేత వైయ‌స్ జగన్‌ పాదయాత్ర వైయ‌స్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి నవంబరు 6, 2017న ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర 300 రోజుల‌కు చేరుకోవ‌డంతో స‌రికొత్త చ‌రిత్ర‌. 

పాదయాత్రలో మైలురాళ్ళు:-  
కిలోమీటర్ల వారీగా పాదయాత్రలో ఘట్టాలు 
3200 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా బాగువ‌ల‌స‌(అక్టోబ‌ర్ 24, 2018)
3100 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఆనంద‌పురం క్రాస్ (అక్టోబ‌ర్,8,2018)
3000 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌. కోట నియోజ‌క‌వ‌ర్గంలోని దేశ‌పాత్రునిపాలెం(సెప్టెంబ‌ర్‌24, 2018) 
2900 కిలోమీట‌ర్లు విశాఖ జిల్లా స‌బ్బ‌వ‌రం (సెప్టెంబ‌ర్ 5, 2018)
2800 కిలోమీట‌ర్లు విశాఖ జిల్లా యలమంచిలి (ఆగ‌స్టు 24, 2018)
2700 కిలోమీట‌ర్లు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం (ఆగ‌స్టు11, 2018)
2600 కిలోమీట‌ర్లు తూర్పు గోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట‌( జులై 8, 2018)
2500 కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పులసపూడి వంతెన వద్ద (జులై 8, 2018)
2400 కిలోమీట‌ర్లు తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం ల‌క్క‌వ‌రం క్రాస్ వ‌ద్ద (జూన్ 21, 2018)
2300 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు ‍క్రాస్‌ రోడ్డు వద్ద  2300 కిలోమీటర్లు(జూన్ 11, 2018).
2200 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో రైల్వేగేటు దగ్గర (మే 30,2018)
2100 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పిప్పర(మే 22,2018)
2000 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం (మే 14,2018)
1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7,2018)
1600-గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1400 - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ 24, 2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017)
0 - వైయ‌స్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017) 

ఏ రోజు ఎక్కడ?..

ప్రజా సంకల్ప యాత్ర.. 2017, నవంబరు 6న వైయ‌స్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభం అయింది.
- 25వ రోజు యాత్ర గత డిసెంబరు 3న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం, తుగ్గలి మండలం మదనాంతపురంలో మొదలై చెరువు తండా వరకు కొనసాగింది.
- 50వ రోజు యాత్ర ఈ ఏడాది జనవరి 2న చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని ‘చిన్న తిప్ప సముద్రం’ (సీటీఎం) నుంచి మొదలై పీలేరు నియోజకవర్గంలోని జమ్ములవారిపల్లి వరకు సాగింది.
- 75వ రోజు యాత్ర జనవరి 30న నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం శివారు నుంచి కలిచేడు వరకు సాగింది.
- 100వ రోజు యాత్ర ఫిబ్రవరి 28న ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం, పొదిలి మండలంలోని ఉప్పలపాడు నుంచి మొదలై సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి వరకు సాగింది.
- 125వ రోజు యాత్ర మార్చి 31న గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సరిపూడి నుంచి మొదలై వెలవర్తిపాడు, మేడికొండూరు, గుండ్లపాలెం క్రాస్‌ రోడ్స్‌ మీదుగా పేరేచర్ల వరకు సాగింది.
- 150వ రోజు యాత్ర మే 1వ తేదీన కష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని పర్ణశాల శివారు శిబిరం నుంచి ప్రారంభమై చిట్టిగూడూరు, గూడూరు, రామరాజుపాలెం క్రాస్, సుల్తానగరం మీదుగా మచిలీపట్నం వరకు కొనసాగింది.
- 175వ రోజు యాత్ర మే 29వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం శివారు నుంచి ప్రారంభమై తలతాడితిప్ప, మెంతేపూడిక్రాస్, బొప్పనపల్లి, మత్స్యపురి, సీతారామపురం క్రాస్‌ మీదుగా కొప్పర్రు వరకు కొనసాగింది.
- 200వ రోజు యాత్ర జూన్‌ 27, 2018, బుధవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం శివారు నుంచి ప్రారంభమైంది.
- 300 రోజు విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గంలోని కోట‌వాని వ‌ల‌స నుంచి ప్రారంభం   


Back to Top