కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లాలో ఘన స్వాగతం లభిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా పూలపై నడిపిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని సమస్యలు ఏకరువు పెడుతున్నారు. జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు సౌదరదిన్నె నుంచి ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటలకు ఆయన ఆమదాల క్రాస్ రోడ్డు చేరుకున్న ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉదయం 9.30 గంటలకు బనగాలపల్లి మండలం గులాంనబీ పేట-బొండల దిన్నెక్రాస్ రోడ్‌కు చేరుకున్నారు.