బంద్ సందర్భంగా పాదయాత్రకు విరామం

ప్రత్యేక హోదా సాధన డిమాండ్ తో ఈనెల 16 వ తేదీ సోమవారం నాటి రాష్ట్ర బంద్ కు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ఈ బంద్ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. 
పార్టీ శ్రేణులందరూ, బంద్ లో పాల్గొనేందుకు వీలుగాను, బంద్ ను విజయవంతం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జగన్ మోహన్ రెడ్డి మైలవరం నియోజకవర్గంలోని ముత్యాలపాడు శిబిరం వద్దనే బసచేసి, తిరిగి మంగళవారం ఉదయం పాదయాత్రను ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top