మా బిడ్డకు వైయస్‌ జగన్‌ ప్రాణాలు పోశారు..

శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో మానవీయ కోణాలు ఎన్నో..ఇందులో ఒకటి దెందులూరు నియోజకవర్గం సీతంపేటకు చెందిన బాలుడు లోకేష్‌ మణికంఠ ఉదంతం.బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న లోకేష్‌కు  వైద్యం చేయించిన వైయస్‌ జగన్‌ను  కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్‌ జగన్‌ తన బిడ్డకు పునర్జన్మ ఇచ్చారని తెలిపారు. వైయస్‌ జగన్‌ సాయం చేయకపోతే తన బిడ్డ పరిస్థితి ఏవిధంగా ఉండేదోనని లోకేష్‌ తండ్రి కన్నీరు పెట్టుకున్నారు.

హైదరాబాద్‌ తీసుకెళ్తే  ఆపరేషన్‌కు సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని, ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న తనకు అంత స్థోమత లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేను కలిసిన సాయం అందించలేదన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా జరగలేదన్నారు. వైయస్‌ జగన్‌ను కలిశానని  వ్యక్తిగతంగా సాయం చేసి తమ బిడ్డకు పునర్జన్మ ఇచ్చారన్నారు.వైయస్‌ జగన్‌కు ఎంతోరుణ పడి ఉంటామన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top