మా బిడ్డకు మాటలొచ్చాయి..


మహానేత వైయస్‌ఆర్‌ మేలు మరవలేం..
వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన దంపతులు..

విజయనగరంః  దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి వలనే తమ కూతురుకు మాటలు వచ్చాయని బాడంగికి చెందిన నాగేశ్వరరావు, కల్యాణి దంపతులు అన్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను ప్రజా సంకల్పయాత్రలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు . దివ్యాంగురాలైన తమ కూతురు ఆపరేషన్‌కు వైయస్‌ఆర్‌ నిధులు విడుదల చేశారని మహానేత దయతోనే మాకు మేలు జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. రాజన్న బిడ్డ వైయస్‌ జగన్‌ పాలన కోసం ఎదురుచూస్తున్నామని ఆయన నాయకత్వంలోనే మళ్లీ రాజన్న రాజ్యం చూస్తామనే నమ్మకం నూరుశాతం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Back to Top