<br/>విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వైయస్ జగన్‌ను కలిశారు. ఏళ్ల తరబడి తమతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కరువైందని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.