‘మాల, మాదిగలు నాకు రెండు కళ్లు’

ప్రకాశం:

మాల, మాదిగలు తనకు రెండు కళ్లలాంటి వారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో యడవల్లి వద్ద మాదిగ నేతలు వైయస్‌ జగన్‌ను కలుసుకుని వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ స్పందిస్తూ అధికారంలోకి రాగానే మాల, మాదిగల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 

Back to Top