<strong>వైయస్ జగన్‌ను కలిసిన ఉద్ధానం అభివృద్ధి కమిటీ సభ్యులు..</strong>శ్రీకాకుళంః ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్యపై చలించిన ఆ ప్రాంతానికి చెందిన యువకులు ఉద్దానం అభివృద్ధి వేదిక పేరుతో స్వచ్ఛందంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఉద్దానం అభివృద్ధి వేదిక సభ్యులు వైయస్ జగన్ కలిసి ఉద్దానం కిడ్నీ సమస్యపై వివరించారు. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని సభ్యులు కోరారు. కిడ్నీవ్యాధి బారినపడిన వారికి పింఛన్ కల్పించాలని వినతించారు.కిడ్నీ వ్యాధి రిసెర్చ్ సెంటర్‌ను ఉద్దానంలో ఏర్పాటు కేయాలని కోరామన్నారు.అన్నివిధాలుగా అండగా ఉంటామని వైయస్ జగన్ సానుకూలంగా స్పందించడం పట్ల వేదిక సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.