కళాకారులను ప్రభుత్వం గుర్తించ‌డం లేదు

విశాఖ‌:  టీడీపీ ప్రభుత్వం కళాకారులకు గుర్తించడం లేదని నాటకరంగ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో సోమ‌వారం వైయస్‌ జగన్‌ను  నాటకరంగ కళాకారులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కళాకారులు నాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని నాటక రంగ కళాకారుడు శ్రీనివాసరాజు అన్నారు. ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టకున్న పట్టించుకోవడంలేదన్నారు.కనీసం పింఛను కూడా రావడం లేదన్నారు. జగన్‌ సిఎం అయితే మా కళాకారులకు మంచిరోజులొస్తాయన్నారు. 
 
Back to Top