<strong>పశ్చిమగోదావరి</strong>: ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోవడంతో ఇల్లు తాకట్టుపెట్టి ఆపరేషన్ చేయించుకున్నానని సత్యనారాయణరాజు అనే వ్యక్తి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన బాధను వ్యక్తం చేసుకున్నాడు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మారంపల్లి వద్ద సత్యనారాయణరాజు వైయస్ జగన్‌ను కలిశారు. కేన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రులకు వెళితే.. ఆరోగ్యశ్రీ వర్తించదని వెనక్కు పంపారని, చేసేది లేక ఇల్లు తాకట్టుపెట్టి ఆపరేషన్ చేయించుకున్నానని వాపోయాడు. చంద్రబాబు ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదని, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలను నీరుగారుస్తుందని సత్యనారాయణరాజు మండిపడ్డారు.