నిర్భంధ పాలన పోవాలి..జ‌గ‌న‌న్న రావాలి


- నిన‌దిస్తున్న టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు 
- అడుగ‌డుగునా విన‌తుల వెల్లువ‌
- అభిమాన నేత‌కు బ్ర‌హ్మ‌ర‌థం
శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు భారీగా తరలివచ్చి సముద్ర కెరటంలా ఎగిసిపడ్డారు. అధికార పార్టీ నేతల బెదిరింపుల్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తామన్న హెచ్చరికల్ని, సామాజిక బహిష్కరణ హూంకరింపుల్ని లెక్కచేయకుండా జగన్‌కు జై కొడుతున్నారు.  అధికారం అండ చూసుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతల తీరును జ‌న‌నేత‌కు వివరిస్తూ మండిపడ్డారు. ‘ఇక ఈ దొరతనాన్ని సహించలేమన్నా.. చైతన్యానికి మారుపేరు ఈ నియోజకవర్గం, మా సత్తా ఏమిటో చూపుతాం’ అంటూ ప్రతినబూనారు. నిర్భంద పాల‌న పోవాలి..జ‌గ‌న‌న్న రావాలంటూ టెక్క‌లి ప్ర‌జ‌లు నిన‌దించారు. గురువారం ఉదయం జననేత దుర్గమ్మ పేట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి లక్ష్మీపురం క్రాస్‌, సవరపేట క్రాస్‌, శివరాంపురం క్రాస్‌, సంతబొమ్మళి, బోరభద్ర క్రాస్‌, జగన్నాథపురం క్రాస్‌, వడ్డి తాండ్ర మీదుగా దండుగోపాలపురం వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.  
ఈ రోజు పాద‌యాత్ర ముఖ్యాంశాలు ఇలా.. 

-  శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలంలోని దుర్గమ్మపేట శివారులోని శిబిరం నుంచి యాత్ర ప్రారంభం.
– శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు. అభిమానులు.
– యాత్రకు అన్ని వర్గాల ప్రజల సంఘీభావం.
– పాదయాత్ర ప్రారంభంలో వైయస్‌ జగన్‌ను కలిసిన పలువురు మహిళలు తమకు పింఛను ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.
-  సంతబొమ్మాళి మండలం గోవిందపురంకు చెందిన నీలాపు జయలక్ష్మితో పాటు, లక్ష్మి అనే మహిళ జననేతను కలిశారు. భర్త చనిపోయినా తనకు పింఛను ఇవ్వడం లేదని జయలక్ష్మి మొర పెట్టకోగా, ఏళ్ల తరబడి తిరుగుతున్నా పింఛను మంజూరు చేయడం లేదని లక్ష్మి పేర్కొన్నారు. మరోవైపు అర్హత లేని వారికి కూడా పింఛన్లు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.
–  శిష్టి కరణాలు కూడా జననేతను కలిశారు. గతంలో దివంగత మహానేత వైయస్ఆర్‌ హయాంలో తమను ఓసీల నుంచి బీసీ–డీ జాబితాలోకి మార్చారని, కానీ ఆ తర్వాత తమకు ఓబీసీ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదని వారు తెలిపారు.
- ఓబీసీ సర్టిఫికెట్‌ లేకపోవడంతో కేంద్ర ఉద్యోగాలలో తమ పిల్లలకు రిజర్వేషన్లు దక్కడం లేదని, కాబట్టి ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ శిష్టి కరణాలు రాజన్నబిడ్డకు వినతి పత్రం ఇచ్చారు.
– ఆ తర్వాత లక్ష్మీపురం క్రాస్‌ వద్ద సంతబొమ్మాళి మండలంలోకి అడుగు పెట్టిన జననేత.
– అక్కణ్నుంచి సవరపేట మీదుగా శివరంపురం క్రాస్‌ చేరుకున్న వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.
– గ్రామంలో జననేతను కలిసి ప్రభుత్వ విధానంపై ఫిర్యాదు చేసిన పలువురు సర్పంచ్‌లు.  తాము వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారం కావడంతో చెక్‌ పవర్‌ రద్దు చేసి, గ్రామాల్లో అభివృద్ధి పనులు అడ్డుకున్నారని విపక్షనేతకు వివరించిన 17 మంది సర్పంచ్‌లు.
-  టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడి అరాచకాలు కొనసాగుతున్నాయని, గ్రామాల్లో మంచినీరు దొరక్కపోయినా మద్యం ఏరులై పారుతోందని జననేతకు ఫిర్యాదు చేసిన శివరంపురం వాసులు.
– ఆ తర్వాత సంతబొమ్మాళి చేరుకున్న వైయస్‌ జగన్‌కు మండ‌ల కేంద్రంలో ఘ‌న స్వాగ‌త‌లం ల‌భించింది. 
– గ్రామంలో పాదయాత్ర సందర్భంగా విపక్షనేతను కలిసి బాధలు చెప్పుకున్న లక్ష్మి దంపతులు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపీటీసీగా పోటీ చేసిన తమపై కక్ష కట్టిన మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ పథకాలు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించిన లక్ష్మి దంపతులు.
- టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడి నిర్భంధ పాలన పోవాలని ఆకాంక్షిస్తూ, వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా రెండు పావురాలు ఎగరవేయించిన లక్ష్మి దంపతులు.
– మరోవైపు మత్స్యకార సంఘాల ప్రతిని«ధుల భేటీ. పలు సమస్యలపై వినతి పత్రం సమర్పణ. మత్స్యకారులను ఎస్సీలుగా గుర్తించాలని, జిల్లాలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా మరిన్ని జెట్టీలు నిర్మించాలని, చేపల వేటపై నిషేధ సమయంలో నెలకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, తమకూ ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, పింఛను వయస్సు తగ్గించాలని, చనిపోయిన మత్స్యకారులకు ఇస్తున్న పరిహారం పెంచాలని, బీమా సదుపాయం వర్తింపచేయాలని కోరుతూ వారు వినతి పత్రం ఇచ్చారు. మత్స్యకారుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన జననేత. అంతులేని హర్షం వ్యక్తం చేసిన మత్స్యకారులు.
– గ్రామంలో పాదయాత్ర అనంతరం శివారులోని శిబిరం వద్ద మధ్యాహ్న భోజనం కోసం ఆగిన వైయస్‌ జగన్‌.
–   దారి పొడవునా జననేతను కలిసి సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు. తమ బిడ్డలను ఆశీర్వదించమని కోరిన తల్లులు. 
– ఇంకా సెల్ఫీల కోసం ఆరాట పడిన మహిళలు, విద్యార్థినిలు.
–  వైయస్‌ జగన్‌తో కలిసి అడుగులు వేసిన రైతులు, మహిళలు, విద్యార్థులు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు పలు చోట్ల బారులు తీరిన ప్రజలు.  
– జననేతతో కరచాలనం కోసం పోటీ పడిన బస్సులు, ఇతర వాహనాల ప్రయాణికులు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ యాత్రలో ముందుకు సాగిన వైయస్‌ జగన్‌.

Back to Top