<strong>విజయనగరంః</strong> విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు వైయస్ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలంటూ వైయస్ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం విద్యుత్ కార్మికుల సంక్షేమం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్న గుర్తింపులేదని వాపోయారు. ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్నామన్నారు. వైయస్ జగన్ సమస్యలు సావధానంగా విన్నారని, తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా కల్పించారన్నారు.పొరుగు రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను చిన్నచూపు చూస్తుందన్నారు.