ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు..

విజయనగరంః కేటివాడ గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.చంద్రబాబు రైతు రుణామాఫీ అని మోసం చేశారని, ఒక రూపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు.తాగునీరు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకోవలసి దుస్థితి ఏర్పడిందని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.తమ గ్రామంలో కనీస సౌకర్యాలు కూడా టీడీపీ ప్రభుత్వం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.చంద్రబాబు పేదలను పట్టించుకోవడంలేదన్నారు.టీడీపీకి చెందినవారికే లబ్ధి చేకూరుస్తురన్నారు.తోటపల్లి ప్రాజెక్టు కిందనే ఉన్నా సాగునీరు కూడా మా గ్రామానికి అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తాగునీటికి కుళాయిలు,సాగునీటికి బోర్లు సౌకర్యాలు కూడా లేవన్నారు.గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేక ప్రజలు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతన్నామన్నామన్నారు.
Back to Top