వైయస్‌ జగన్‌ రాక కోసం పార్వతీపురం ముస్తాబు.

వైయస్‌ జగన్‌ రాక కోసం పార్వతీపురం ముస్తాబు.
ప్రత్యేక ఆకర్షణగా స్వాగత తోరణం
విజయనగరంః వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాక సందర్భంగా పార్వతీపట్టణం అంతా వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలు, జెండాలతో నిండిపోయింది. నవరత్నాల పథకాల ఫొటోలు, పార్టీ గుర్తు ఫ్యాన్‌లతో ఏర్పాటు చేసిన స్వాగత తోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.పాదయాత్రకు సంబంధించి అరుదైన ఫోటోలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం జరగబోయే బహిరంగ సభకు పార్వతీపురం పట్టణం సిద్ధమైంది. వైయస్‌ జగన్‌ కోసం పార్వతీపురం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే జిల్లా నలుమూలల నుంచి పార్వతీపురంలో జరగబోయే వైయస్‌ జగన్‌ బహిరంగ సభకు ప్రజలు తరలివస్తున్నారు.

Back to Top