వైయస్‌ జగన్‌ను కలిసిన ఈ–పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లు

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రకాశం జిల్లా ఈ–పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లు కలిశారు. జిల్లా వ్యాప్తంగా 200 మంది ఆపరేటర్లు ఉన్నారని, 2013లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకున్నారని చెప్పారు. అయితే సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ప్రబుత్వ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మమ్మల్ని రెగ్యులర్‌చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని వైయస్‌జగన్‌ను కోరారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.

 
Back to Top