వైయస్‌ జగన్‌ను కలిసిన డిఎస్సీ అభ్యర్థులు

విజయనగరంః జోగింపేట వద్ద జగన్‌ను కలిసి  డీఎస్సీ అభ్యర్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారికి డిఎస్సీకి అర్హత సరికాదని వినతి పత్రం అందజేశారు. ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ వాళ్లకు అవకాశం కల్పించారని, ఇంజినీరింగ్,డిగ్రీ వాళ్లకు అర్హత కల్పించడం  సరికాదు. సుమారు 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారన్నారు. కనీసం ఏడు వేల పోస్టులు కూడా భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు 20,30 పోస్టులు కూడా లేవని,పోస్టుకు 2వేల నుంచి 3వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు.లక్షల పెట్టి కోచింగ్‌లు తీసుకున్న అభ్యర్థులు పరిస్థితి వృధా ప్రయాస అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  భరోసా ఇచ్చారని డిఎస్సీ అభ్యర్థులు తెలిపారు.

Back to Top