రైతులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు...

 శ్రీకాకుళం రైతులు గోడు..

శ్రీకాకుళంః వైయస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశారని రైతులు అన్నారు.రైతులకు ధాన్య రవాణా ఖర్చు కూడా ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు.ప్రస్తుత పాలకులు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను శ్రీకాకుళం రైతులు కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. మహానేత వైయస్‌ హయాంలో రైతులకు రవాణా ఖర్చులు ఇచ్చేవారని, ప్రస్తుతం ఎలాంటి ఛార్జీలు ఇవ్వడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వం రవాణా ఖర్చు ఇస్తామని చెప్పి  ఇవ్వలేదన్నారు. 2014 నుంచి రూ.64 కోట్లు రవాణా ఖర్చు ఇస్తామని చెప్పి నేటికి కూడా చెల్లించకూడా టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.మళ్లీ రైతులను మోసం చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్‌ఆర్‌ హయాంలో పండిన పంటకు మంచి ధర ఉండేందన్నారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో కనీస ధర కూడా ఇవ్వడంలేదన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో ఉచిత విద్యుత్‌ ఇచ్చి రైతులను ఆదుకున్నారన్నారు.
 
Back to Top