తిమ్మ‌రాజుపేట నుంచి 249వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. య‌ల‌మంచ‌లి నియోజ‌క‌వ‌ర్గంలోని తిమ్మరాజుపేట శివారు నుంచి బుధవారం ఉదయం  వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడ నుంచి మండల కేంద్రమైన మునగపాక, గంగాదేవిపేట క్రాస్, ఒంపోలు మీదుగా వెళ్లి వైయ‌స్‌ జగన్‌ నాగులాపల్లిలో మధ్యా హ్న భోజన విరామానికి ఆగుతారు. తిరిగి మధ్యాహ్నం పాదయాత్ర హైవే దాటుకుని అనకాపల్లి పట్టణంలోకి ప్రవేశిస్తారు. అనకాపల్లి మెయిన్‌ రోడ్డు, ఉమ్మలాడ క్రాస్‌ రోడ్డు, పూల్‌బాగ్‌రోడ్డు జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా నెహ్రూచౌక్‌కు చేరుకుంటారు. అన‌కాప‌ల్లి టౌన్‌లో ఏర్పాటు చేసిన‌ బహిరంగసభలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. ఆ త‌రువాత రైల్వే అండర్‌ బ్రిడ్జి, గాంధీనగర్, గుండాల జంక్షన్, చినబాబుకాలనీ, తుమ్మపాల మీదుగా పాద‌యాత్ర కొన‌సాగుతుంది.
Back to Top