వైయస్సార్‌ సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

చినతాడినాడ (కైకలూరు) : క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి వైయస్సార్‌ సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) అన్నారు. కలిదిండి మండలం చినతాడినాడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు నీలపాల వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నంగెడ్డ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నవరత్నాల ప్రచార కార్యక్రమం మంగళవారం జరిగింది. డీఎన్నార్‌ సమక్షంలో పలువురు పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి పార్టీ కరపత్రాలను అందించారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను విరివిగా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా డీఎన్నార్‌ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పథకాలు తిరిగి పూర్తి స్థాయిలో అమలుకావాలంటే జగన్‌ ముఖ్యమంత్రిగా రావాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు అల్లూరి సత్యనారాయణరాజు, జిల్లా ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కాగితాల కాటంరాజు, మండల లీగల్‌ సెల్‌ అధ్యక్షులు కట్టా సత్యనారాయణ, పార్టీ నాయకులు నారగాని అయ్యప్ప, కట్టా మహేష్, రామకృష్ణ, వీరమల్లు సురేష్, గూడవల్లి వెంకన్న, కొనగాళ్ల సత్యనారాయణ, పడమటి రాజేష్, చిల్లిముంత ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top