తక్కెళ్లపాడులో వైయస్ఆర్ కుటుంబం

తక్కెళ్లపాడు(దాచేపల్లి): మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంను నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సెల్‌ఫోన్‌ ద్వారా వైయస్సార్‌ కుటుంబంలో సభ్యత్వం నమోదు చేయించారు. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే అమలు చేసే నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుడూరి గోవర్ధన్‌రావు, ఎంపీటీసీ మాజీ సభ్యులు జక్కా అనంతరామయ్య, పాశం వీరయ్య, బూత్‌కమిటీ కన్వీనర్లు చలువాది శ్రీనివాసరావు, టంటం కోటేశ్వరరావు, గ్రామపార్టీ అధ్యక్షుడు జక్కా శ్రీనివాసరావు, నాయకులు టంటం యలమందయ్య, పాశం శ్రీనివాసరావు, వట్టెపు సీమోను, కాటం శివారెడ్డి, టంటం రామసైదులు, టంటం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top