పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు

మైలవరం: నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో అమలు జరిగిన విధంగానే వైయస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే పార్టీలు, కుల,మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్‌ తెలిపారు. మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎమ్‌.ఎలీషారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జోగి రమేష్‌ మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వస్తే నవరత్నాలు వంటి తొమ్మిది సంక్షేమ పథకాలు అమలు చేస్తారని, ఈ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందన్నారు. నిరు పేదల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవచ్చని, నిరుపేదలకు కార్పోరేట్‌వైద్యం అందుబాటులోకి వస్తుందని, 108 సేవలు పేదల ముంగిటకే వస్తుందన్నారు. ఇంటింటికి తిరిగి నవరత్నాలు కరపత్రాలు పంపిణీ చేశారు. వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించినందుకు గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.  మహిళలు హారతి పట్టి జోగి రమేష్‌ను ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలీషారావు, నాయకులు బుర్రి ప్రతాప్, కిశోర్‌రెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top