ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే ఏ నాడూ ప‌ట్టించుకోలేదు

మంగ‌ళ‌గిరి : చ‌ంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రం అభివృద్ధిలో  ప‌రుగులు పెడుతుంద‌న్న నాయ‌కులంతా దోచుకోవ‌డం త‌ప్పి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను కానీ, అభివృద్ధిని కానీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌ట‌మ‌ట 14వ డివిజ‌న్‌లోని స్కూబ్రిడ్జి, కోటి న‌గ‌ర్‌, రామ‌లింగేశ్వ‌న‌గ‌ర్ వాసులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో వారి ఆవేద‌న‌ను వెలిబుచ్చారు. ``వైయ‌స్ఆర్ కుటుంబం`` కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పటమట 14వ డివిజన్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి చాలా మంద‌ని వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర్పించారు. ఈ సంద‌ర్భంగా డివిజన్‌ పార్టీ అధ్యక్షులు గాదిరెడ్డి పూర్ణచంద్రరావు(అమ్ములు) మాట్లాడుతూ నదీపరివాహక ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఇళ్లపట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారం చేపట్టాక తమ పట్టాల ఏసే ఎత్తటంలేదని, దీనిపై ప్రశ్చించేవారిపై అధికార జులుంకు పాల్పడుతున్నార‌న్నారు.  అర్హులైన వారికి పెన్షన్‌లు, నిరుద్యోగ ఉపాధి తదితర అంశాలపై ప్రశిస్తున్నవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వీరంరెడ్డి బలరామిరెడ్డి, బ్రహ్మారెడ్డి, మిరియాల అర్జునరావు, కొమ్మిడి శ్రీనివాసరెడ్డి, గుర్రాల భాస్కరరావు, కానుకొల్లు నాని, బండిరెడ్డి బాబ్జీ, బద్రీ, మద్దా సూరిబాబు, మద్దా సూరిబాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Back to Top