గాడిత‌ప్పిన పాల‌న‌

తూర్పు గోదావ‌రి: ప్రభుత్వం మూడు  సంవత్సరాలు కావస్తున్నా కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్దాయిలో మంచినీరు, డ్రయినేజి, రహదారులు నిర్మించలేకపోతున్నారని, కోట్లు వెచ్చించామంటున్న ప్రభుత్వం కనీసం ప్రజాపాలనను గాలికొదిలేసింది అంటూ ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామం అల్లూరివారి చెరువు వాసులు గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం లో నియోజకవర్గ వైయ‌స్ఆర్‌ సీపీ కోఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మండల కన్వీనర్‌ పిన్నంరాజు వెంకటపతిరాజు(శ్రీను) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో గ్రామంలో మెండి మహలక్ష్మి, నేరేడుమిల్లి శ్రీనివాస్‌ తదితరులు గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, డబ్బులు ఇచ్చుకొని తాగునీరు కొనుక్కొంటున్నామని, గత కొద్ది నెలలుగా తాగునీటి సమస్య అదికంగా ఉందన్నారు. వరసాల వెంకటరెడ్డికి అన్ని అర్హతలు ఉన్నా ఫింఛను రావడం లేదని, గంటి చంద్రకళకు భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అయింది కాని ఇప్పటి వరకూ పలుమారు ధరకాస్తు చేసుకొన్నా వితంతు ఫింఛను అందలేదని వాపోయారు.  పదవీ కాలంలో సగం రోజులు పూర్తిఅయినా గ్రామంలో చేసిన అభివృద్ది శూన్యమని, ఒకే ఇంటిలో రెండు మూడు కుటుంబాలు నివాసముంటున్నామని, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని, ఇల్లు మంజూరులోను, ప్రభుత్వ పధకాలు మంజూరులో అధికార పార్టికి చెందినవారికి మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు కోలనీలు పర్యటించి ప్రజల వద్దనుంచి పెద్ద ఎత్తున  సమస్యలు తెలుసుకొన్నారు.  టిడిపీ అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్దానని చెప్పి ఇంతవరకూ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే దని ఆవేదన వ్యక్త ంచేశారు.    దీనిపై బాలకృష్ణ మాట్లాడుతూ త్వరలో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గరపడిందని,గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యాడని అన్నారు. ఈకార్యక్రమంలో ఈయన వెంట   ఈకార్యక్రమంలో కాశి బాలమునికుమారి, పి.టి.వి.వర్మ, మోకా రవి, దంతులూరి రాఘవరాజు, విత్తనాల శ్రీనివాసరావు, ఇందుకూరి రంగరాజు, బొంతు కనకారావు, పిన్నంరాజు పెదబాబు, జనిపెల్ల మూర్తి, బుడిత నాగన్న, గెద్దాడ నాగన్న, సఖిలే వెంకటేశ్వరావు, పి.రామకృష్ణ, గుత్తుల శ్రీను, ఎం.మురళి, మోకా సత్యనారాయణ, గుత్తాల సత్యనారాయణ, పులపకూర వెంకట్రావు, శీలం వెంకటరమణ, సుబాన్‌ డాక్టర్, ఉందుర్తి ఈశ్వరి తదితరులు ఉన్నారు. 

Back to Top