టీడీపీ నేతలు కళ్లబొల్లి మాటలు మానుకోవాలి

నెల్లూరు(నాయుడుపేట)) తమ సమస్యలను అధికారులకు, పాలకులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మహిళలు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వద్ద తమ ఆవేదనను వెలిబుచ్చారు. వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.  పట్టణంలోని 19వ వార్డు ఎస్ఎస్ఆర్ కాలనీలో వైయస్సార్సీపీ  పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి చంద్రబాబు అవినీతి పాలనను ఎండగట్టారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు గడపగడపకు వెళుతున్న వైయస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేత బీదరవీంద్ర విమర్శలు చేయడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రజలు టీడీపీ నేతల కళ్లబొల్లి మాటలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  


Back to Top