ప్రతీ నోట ఒకే మాట

  • గడపగడపలో వైయస్సార్సీపీకి జన నీరాజనం
  • బాబు పాలనపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు
క‌ర్నూలు జిల్లా నెట్‌వ‌ర్క్‌:

నందికొట్కూరులో..
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మానికి ప్రజలు నీరాజనం పడుతున్నారు. క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఐజ‌య్య ఆధ్వ‌ర్యంలో ప‌గిడ్యాల ప‌ట్ట‌ణంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం జరిగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ...బాబు మోసపూరిత పాలనపై నిప్పులు చెరిగారు. అబద్ధపు హామీలతో వంచించిన బాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. 

ఎమ్మిగ‌నూరులో...
తమ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వ‌చ్చిన వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు మంగ‌ళ‌హార‌తుల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా క‌ర్నూలు జిల్లా ఎమిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నంద‌వ‌రం గ్రామంలో ప‌ర్య‌టించి చంద్ర‌బాబు చేస్తున్న మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. 

నంద్యాల‌లో....
ఏ గ‌డ‌ప తొక్కినా... ఏ మ‌నిషిని ప‌ల‌క‌రించిన ఒకే మాట ఒకే నినాదం వినిపిస్తోంది.  మాయ‌మాట‌ల‌తో వంచించి అధికారంలోకి వ‌చ్చిన నీచ రాజ‌కీయ‌నాయ‌కుడ‌ు చంద్రబాబు అంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.  క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ రాజ‌గోపాల్ ప‌ట్ట‌ణంలోని 30వ వార్డులో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబు మోసాలపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని చెప్పారు.

కోడుమూరులో...
గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. క‌ర్నూలు జిల్లా కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గం గుడూరు మండ‌లం బుడిద‌పాడు గ్రామంలో... నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ముర‌ళీకృష్ణ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఎన్నికల హామీలకు సంబంధించి బాబు పాలనపై ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. ఈసందర్భంగా ప్రతీ ఒక్కరూ చంద్రబాబును తిట్టిపోశారు.  

బ‌న‌గాన‌ప‌ల్లెలో...
బాబు అవినీతి, అక్రమ పాల‌న‌కు కాలం చెల్లింద‌ని వైయ‌స్సార్ సీపీ బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ కాట‌సాని రామిరెడ్డి అన్నారు.  సంజామ‌ల మండ‌లం పేరుసోముల గ్రామంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌కు త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడ‌తార‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో జిల్లా అధ్య‌క్షుడు గౌరు వెంక‌ట‌రెడ్డి, జ‌డ్పీటీసీ బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఆళ్ల‌గ‌డ్డ‌లో...
చంద్ర‌బాబు పాల‌న‌పై వైయస్సార్సీపీ సంధించిన వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌లో బాబుకు  ఒక్క మార్కు కూడా ప‌డ‌డం లేద‌ని ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ రామ‌లింగారెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌పకూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న చాగ‌ల‌మ‌ర్రి మండ‌ల ప‌రిధిలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top