పోలవరం పేరుతో దోపిడీ

రామచంద్రపురం : ఒక పక్క గోదావరి నదిపై ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామంటూ రైతుల నోట్లో మట్టి కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ విమర్శించారు. నియోజకవర్గంలో గడపగడపకూ వైయస్సార్‌ కార్యక్రమం  ప్రారంభించి వంద రోజులు అయిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 

రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకూ వైయస్సార్‌ కార్యక్రమంలో గ్రామాల్లోకి వెళుతున్న పార్టీ నేతలకు ప్రజలు వారి సమస్యలను చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీలతో రాష్ట్ర ప్రభుత్వం మరో అధికార యంత్రాగాన్ని కొనసాగిస్తూ.. స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. అధికారులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలు చెప్పినవారికే ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బోస్‌ తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top