200 గడ‌ప‌ల‌కు ప్ర‌జాబ్యాలెట్‌

పి.గన్నవరం: పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి మండలం ఎన్‌.పెదపాలెం గ్రామంలో గడప గడపకూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా పార్టీ కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవితో పాటు 100 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల వరకు జరిగింది. సుమారు 200 ఇళ్లకు వెళ్లి వారు ప్రజా బ్యాలెట్లు అంద‌జేసి టీడీపీ స‌ర్కార్ మోస‌పూరిత ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

తాజా ఫోటోలు

Back to Top