అంత‌టా బాబుకు సున్నా మార్కులే

కురుపాం: ప్ర‌జ‌లంతా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌కు సున్నా మార్కులే వేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ‌వాణి స్ప‌ష్టం చేశారు. వైయ‌స్ఆర్ సీపీ యువ‌భ‌జ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌త్రుచ‌ర్ల ప‌రిక్షిత్ రాజుతో క‌లిసి ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ‌వాణి నియోజ‌క‌వ‌ర్గ‌ ప‌రిధిలోని కొమ‌ర‌డ మండ‌లం కంభావ‌ల‌స గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ చంద్ర‌బాబు మోస‌పు హామీల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను పంచారు. స్థానిక ప్ర‌జ‌ల‌తో బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ ఎక్క‌డికెళ్లినా బాబుకు వంద‌కు సున్నా మార్కులే వేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి త‌ప్పుడు వాగ్ధానాలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడ‌ని మండిప‌డ్డారు. రైతుల‌ను, డ్వాక్రా మహిళ‌ల‌ను, నిరుద్యోగుల‌ను, విద్యార్థుల‌ను ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లను మోసం చేశాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌కుండా రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నార‌ని ఆరోపించారు. రాబోయే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు త‌మ ఓటుతో త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని సూచించారు. వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రిని చేస్తే రాష్ట్రంలో ప్ర‌జారంజ‌క పాల‌న కొన‌సాగుతుంద‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 


Back to Top