<span style="text-align:justify">ఇచ్చాపురంః చంద్రబాబు పరిపాలనలో ఏ గ్రామం చూసినా సమస్యలతో దర్శనమిస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం నాయకులు అన్నారు. బుధవారం ఇచ్చాపురం నియోజకవర్గంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బాబు అవినీతి పరిపాలనపై వివరించారు. చంద్రబాబు ఎన్నికల మోసపు హామీలపై ప్రచురించిన ప్రజా బ్యాలెట్‌ను స్థానికులకు అందజేసి బాబు పాలనపై మార్కులు వేయించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. <br/></span>