శ్రీకాకుళం(టెక్కలి))కొండపై నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని కొండభీపురం గ్రామస్తులు వాపోయారు. టెక్కలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ స్థానికంగా గడపగడపలో పర్యటించారు. కనీస మౌళిక కదుపాయాలు, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలను గ్రామస్తులు తిలక్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ నేతలు తమకు అన్యాయం చేస్తున్నారని, దీంతో చేసేది లేక వలసలు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తిలక్ సమస్యలను డివిజన్ అధికారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గడపగడపలో కరపత్రాలు పంపిణీ చేశారు.