శ్రీకాకుళంః పేదల సంక్షేమాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ధ్వజమెత్తారు. రామారావు ఆధ్వర్యంలో ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పరిపాలనను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా విదేశీ పర్యటనలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. జననేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రంలో దివంగత రాజన్న పాలన మళ్లీ తిరిగొస్తుందన్నారు. ప్రజల సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.