బాబుది ప్రచార ఆర్భాట పాలన

వైయస్‌ఆర్‌ సీపీ నేత వేగుళ్ల లీలాకృష్ణ
మండపేట: ప్రభుత్వ పథకాల అమలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ ధ్వజమెత్తారు. పట్టణంలోని 7, 24 వార్డుల్లో లీలాకృష్ణ గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరాచక పాలనకు తెరపడే రోజు త్వరలోనే వస్తుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు లక్ష్మిప్రసాదరెడ్డి, కొప్పిశెట్టి శ్రీనివాస్, పడాల సతీష్, గంగుమళ్ల రాంబాబు, బత్తుల జాన్, అబ్బులు, పాలమాల సత్తిబాబు, నేల సూర్యకుమార్, ఉండమాటి నాగు తదితరులు పాల్గొన్నారు. 

కాకినాడ జగన్నధపురంలో 23వ డివిజన్లో విష్ట్ణాలయం వీధి, కూర్మాకుల వీధి  ఏరియాలలో కాకినాడ సిటి అసెంబ్లీ  పార్టీ కో-ఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం జరిగింది. ఇంటింటికీ తిరిగి బాబు మోసాలను ఎండగట్టారు.      

తాజా ఫోటోలు

Back to Top