మామిడికుదురు: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ‘ప్రజా సంకల్ప’ యాత్రకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు కోరారు. నగరం గ్రామంలో బుధవారం జరిగిన ‘వైయస్సార్ కుటుంబం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారని, వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. వీటిపై ప్రజల తరఫున పోరాడుతుంటే ప్రతిపక్షంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలసుకుని, వాటిపై పోరాటం చేయడంతో పాటు ప్రజలకు భరోసా కల్పించేందుకు జగనన్న ప్రజల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. జగన్ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ సమస్యలను విన్నవించాలని సూచించారు. జగన్ ప్రకటించిన నవ్యాంధ్రకు నవరత్నాల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. వైఎయస్సార్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచారు. వైయస్సార్ కుటుంబంలో పలువురిని సభ్యులుగా చేర్పించారు. మండల పరిధిలోని పెదపట్నం గ్రామంలో కూడా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్టూరి రామకృష్ణ, కొమ్మూరి వీరరాఘవరాజు, అన్వర్ తాహిర్ హుస్సేన్, అక్బర్ అలీ, కొమ్మూరి సత్యనారాయణమూర్తి, యనమదల సత్యనారాయణ, లిఖితపూడి నరేష్, లంకా మోషే, బత్తుల అశోక్, కొమ్ముల మాధవరావు, మట్టా భవానీశంకర్, గంధం రాముడు, మట్టా శ్యామ్, మేడిది కిరణ్, కొండేటి వెంకటేశ్వరరావు, బుంగ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.<br/>