వైయ‌స్ఆర్‌ కుటుంబంలో చేరండి

–వైయ‌స్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
సోమల:  ప్ర‌తి ఒక్క‌రు వైయ‌స్ ఆర్‌ కుటుంబంలో సభ్యత్వం తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి   కోరారు. సోమల మండలంలోని గట్టువారిపల్లె పంచాయతీ శీలయ్యగారిపల్లెలో బుధవారం రాత్రి పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో వైయ‌స్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలన్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం సభ్యత్వం తీసుకుని పార్టీకి మద్దతు ప్రకటించాలని కోరారు. రాబోవు ఎన్నికల్లో సభ్యత్వం పొందిన కుటుంబ సభ్యులు వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి అండగా నిలువాలని కోరారు. మొదటగా గ్రామానికి చెందిన బాలకృష్ణయ్య కుటుంబానికి సభ్యత్వం ఆందజేశారు. నవరత్నాలు, ప్రజాభిప్రాయం కర పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సదుం సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు నాగరాజారెడ్డి సర్పంచ్‌ తులసీరాం నాయకులు నాగభూషణరెడ్డి, శీలం. భాస్కర్, పచ్చాసాహేబ్, మునస్వామి, సిద్దయ్య, మహేష్, రమణ, గుడూసాబ్, హిమాంసాబ్, రాఘవులనాయుడు, మునిఎల్లప్ప, శేఖర్, రత్న, రవి పాల్గొన్నారు.
----------------------------
నవరత్నలతో పేదలకు మేలు 
బి.కొత్తకోట: వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో పేదలకు ప్రయోజనం కలుగుతుందని  ఎంపీపీ ఖలీల్‌అహ్మద్‌ అన్నారు. గురువారం బి.కొత్తకోటలో సంతబజారు, బీరంగిరోడ్లలో వైయ‌స్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ చేపట్టిన పథకాలు, వాటీతో ప్రజలు, రైతులు, మహిళలు, పేదలకు కలిగే ప్రయోజనాలపై వివరించారు. అధికారపార్టీ ప్రజలకు హామీలు ఇచ్చి ఏవిధంగా మోసం చేసిందో వివరిస్తూ వైఎస్‌ఆర్‌ కుటుంబంలో చేర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ సహకార సంఘం చైర్మన్‌ కంచి బలరామిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ జీవీ.రామకృష్ణ, కోఆప్షన్‌ సభ్యులు టీ.బావాజాన్‌ఖాన్, రాయల్‌ సలీం, ప్రభాకర్‌రెడ్డి, సల్మాన్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే బి.కొత్తకోట దళితవాడ, రంగసముద్రంరోడ్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని బూత్‌ కమిటీలు నిర్వహించాయి.  
------------------------
నవరత్నాలతో ప్రతి ఒక్కరికి లభ్ది
గంగాధరనెల్లూరుః వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రతి ఒక్కరికి లభ్ది చేకూరుతుందని సిడిసిఎంఎస్‌ మాజీ అధ్యక్షులు , వైయ‌స్ఆర్‌సీపీ అదికారప్రతినిది, వేల్కూరుబాబురెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వేల్కూరు పంచాయతీ ఇందిరానగర్‌ కాలనీలో గురువారం నవరత్నాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్ళి కరపత్రాలను పంపిణీ చేశారు. తలుపులపై స్టిక్లర్లను అంటించారు. ఆయన మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరముందన్నారు. కార్యకర్తలు నవరత్నాలను ప్రజలకు వివరించి చైతన్యవంతుల్ని చేయాలన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ప్రతి రైతుకు 50 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మునెమ్మ, మాజీ సర్పంచ్‌ రాధాక్రిష్ణారెడ్డి , యూత్‌ అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి , కుట్టి, రవి, కిరణ్, జ్యోతీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
------------------------------ 
వైయ‌స్ఆర్‌ కుటుంటానికి ప్రజాదరణ
– పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి
చిత్తూరు  : ప్రజాసమస్యల తెలుసుకోవడానికి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్య‌క్ర‌మానికి విశేష ప్ర‌జాద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి తెలిపారు. గురువారం స్థానిక ఇరువారంలో నగర ప్రధాన కార్యదర్శి బాలసుబ్రమణ్యంరెడ్డి, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కుటుంబం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్నరన్నారు. నగరశివారు ప్రాంతమైన ఇరువారంలో మౌలిక వసతుల కల్పన మరిచారన్నారు. పలు ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేయడం మరిచిపోయారన్నారు. నగరంలో ఎటువంటి అభివృద్ది కనిపించకపోగా, సమస్యలు తిష్ట వేసిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపీణీ చేసి సమస్యలను తెలుసుకొని వారి తలుపులకు స్టిక్కర్లు అతికించారు. టోల్‌ఫ్రీ నంబర్లుకు కాలనీవాసులు మిస్డ్‌కాల్స్‌ ఇచ్చారు. కార్యక్రమంలో నగర కన్వీనర్‌ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మహిళావిభాగం నగర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, నగర కార్యదర్శి లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు అంజలిరెడ్డి, రూరల్‌ అధ్యక్షురాలు ప్రతిమరెడ్డి, నాయకులు చంద్రరెడ్డి, జస్టిన్, రాయల్‌ప్రభు, వినయ్, అజిత్, తులసీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. 
--------------------
ప్రతి ఇంట్లో అదే ఆదరణ 
శ్రీకాళహస్తి:  మండలంలో నిర్వహిస్తున్న వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు కనబరుస్తున్న ఆదరణ అమోఘమని వైయ‌స్ఆర్‌సీపీ మండల సీనియర్‌ నాయకుడు, రాచగున్నేరి సర్పంచి బొల్లినేని జగన్నాధంనాయుడు, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వయ్యాల వయ్యాల కృష్ణారెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్‌  కుటుంబం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని వేలవేడు గ్రామంలో గ్రామంలో బూత్‌ కన్వీనర్‌ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎం పెద్దాయనా బాగున్నావా..మన నాయకుడు వైఎస్సార్‌ గుర్తున్నారా..ఆయన హయాంలో మేలు జరిగిందా..ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో మేలు జరిగిందా అంటూ ఇంటింటికి తిరిగి ప్రజలను ప్రశ్నించారు. ప్రజలతో వారు డ్వాక్రా రుణమాఫీ జరిగిందా.. రైతు రుణమాఫీ జరిగిందా... ఇంటికో ఉద్యోగం ఇచ్చారా, నిరుద్యోగ బృతి కల్పించారా... చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా..? గతంలో వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి పాలనకు ఇప్పటి నాయకుడు పాలనకు తేడా ఏమిటి? అని ప్రశ్నించి అభిప్రాయాలు సేకరించారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి నవరత్నాలను అమలు చేస్తే కలిగే ప్రయోజనాలను గూర్చి వివరించారు. వైఎస్సార్‌ హయాంలో పార్టీలతో ప్రమేయం లేకుండా తమకు రేషన్‌ కార్డులు, పక్కాగృహాలు, పింఛన్లు, సాగు భామి, అమ్మ ఒడి, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారని ప్రజలు అన్నారు. వారి మొబైల్‌ నుంచి 9125091250 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇప్పించి సభ్యులుగా నమోదు చేయించారు. వారి అనుమతితో ఇంటి ముఖ ద్వారానికి వైఎస్సార్‌ ముఖ చిత్రంతో కూడిన స్టిక్కర్‌ను అంటించారు. రాజన్న సంక్షేమ పథకాలు అమలుకావాలంటే జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా కార్యదర్శి పూడి మునిరామయ్యయాదవ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోపిగౌడ్, చంద్రయ్యనాయుడు, స్థానికులు మునిరాజ, శివాజి, గురునాధం, బ్రహ్మయ్య, గురవయ్య, కూనాటి వెంకటేశ్వరయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top