చంద్రబాబు మోసాలను గుర్తించండి

శ్రీకాకుళం: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారని ఆయన చేస్తున్న మోసాలను ప్రజలు గుర్తించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షరాలు రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని బరటాం, మల్లిఖార్జునపురం గ్రామాల్లో బుధవారం గడప గడపకూ వైయస్‌ఆర్‌   కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ముంగెన్నపాడు గ్రామం నుంచి మల్లిఖార్జునపురం గ్రామం వచ్చిన 70ఏళ్ల వృద్ధుడు సవడాన పోలయ్య తనకు పింఛన్‌ మంజూరు చేయడం లేదని ఆమె వద్ద వాపోయాడు. ఎవరికి అడిగిన పట్టించుకోవడం లేదని వివరించాడు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత నీ ఇంటికే పింఛన్‌ వచ్చేలా పరిపాలన ఉంటుందని ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు. ఆనంతరం స్థానిక విలేకర్లతో రెడ్డి శాంతి మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గ్రామాలకు వచ్చిన ఆపార్టీ నాయకులను, ఎమ్మెల్యేను ప్రజలు నిలదీయాలన్నారు. అన్ని వర్గాల వారిని మోసం చేయడంలో చంద్రబాబుకు మించిన వ్యక్తి మరొకరు దేశంలోనే లేరని వివరించారు. రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాలు కొల్ల గొట్టిన ఘనుడు చంద్రబాబని ఆరోపించారు. రైతుల భూములతో విదేశీలయలను తెచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. డ్వాక్రా, రైతుల రుణ మాఫీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ బృతి, ఇంటికో ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు. మూడేళ్ల పరిపాలనలో ఎన్ని కాలనీ ఇళ్లు కట్టించారో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు వైఫల్యాలను వివరించడంతో పాటు జగన్‌ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. అమెతో పాటు పార్టీ నాయకులు కిలారి త్రినా«ద్, కొల్ల కృష్ణ, పెనుమజ్జి విష్ణు, ఎ్రర జనార్థన, గుజ్జల యోగేశ్వరరావు, గురుగుబెల్లి అప్పన్న, మజ్జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Back to Top