గ‌డ‌ప గ‌డ‌ప‌కూ ఘ‌న స్వాగ‌తం

నెల్లూరు:  జిల్లాలోని కొండాపురం మండ‌లంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. బుధ‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెసు పార్టీ ఉదయగిరి  మాజీ శాసనసభ్యులు  తూమాటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  కొండాపురం మండలంలో తూర్పు యర్రబల్లి గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని మన్నంవారి పల్లె, యర్రబల్లి, బసిరెడ్డి పల్లె, కొత్తపల్లి గ్రామాల్లో గడప గడపకు వైయస్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయా గ్రామాల ప్ర‌జ‌లు చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అలాగే తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను మాజీ ఎమ్మెల్యే ఎదుట ఏక‌రువు పెట్టారు. ఇంటింటా ప‌ర్య‌టించిన చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జాబ్యాలెట్ అంద‌జేసి, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. కార్యక్రమం లో గ్రామ వైస్ ప్రెసిడెంట్ CH. మస్తానమ్మ   , CH.చిన కొండయ్య  , పిన్నిక కొండయ్య  , కొండా మాలకోండారెడ్డి  ,CH.నరసింహారావు , కృష్ణా రెడ్డి , వీరనారాయణ  రెడ్డి , మురళి, రామారావు పాల్గొన్నారు.

శృంగార‌పు కోట‌లో..
విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగార‌పు కోట నియోజ‌క‌వ‌ర్గం కొత్తవలస  మండలంలోని కోణమశివానిపాలెం   గ్రామంలో బుధ‌వారం గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంర‌ద్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ‌ సమన్వయకర్త  నెక్కల నాయుడుబాబు ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.Back to Top