19న అంతర్వేదిలో గడప గడపకూ వైయస్సార్‌

అంతర్వేదిలో ఈ నెల 19వ తేదీ ఉదయం గడప గడపకూ వైయస్సార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వైయస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు జిల్లెళ్ల బెన్నిశుభాకర్‌ బుధవారం తెలిపారు. స్థానిక సైకిల్‌ షాపు సెంటర్‌ నుంచి పై కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు రావి దుర్గ ఆలేంద్రమణి, ఎంపీటీసీ సభ్యుడు దొంగ నాగ సత్యనారాయణ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top