ఉప్పలగుప్తంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

తూర్పుగోదావ‌రి: ఉప్పలగుప్తం మండలం పెదగాడవిల్లిలో గురువారం గడప గడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వ‌హించారు. పార్టీ పీఏసీ సభ్యులు, అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇంటింటా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా 200 గడపలకు పైగా వెళ్లి ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేశారు. గ్రామంలో దళితప్రాంతాలు అభివృద్దికి దూరంగా ఉన్నాయని, స్ధానిక  సమస్యలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. పార్టీ వివక్ష ఎక్కవగా ఉందని పేర్కోన్నారు. నిరుపేదలకు పక్కా గృహలు లేవని ,ఇంటి స్ధలాలు, రుణాలు మంజూరు లేదని, అర్హత ఉన్నా పింఛనులు మంజూరు చెయ్యడం లేదని మొరపెట్టుకున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top