ప్రజాబ్యాలెట్ లో బాబు పరాజయం

టీడీపీ పాలనపై ప్రజాగ్రహం
కర్నూలు(నంద్యాల)) వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. నంద్యాల ఇంఛార్జ్ రాజగోపాల్ రెడ్డి పట్టణంలోని 32వ వార్డులో పర్యటించారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి సహా వందలాది హామీలు గుప్పించిన చంద్రబాబు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోవడం లేదని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలపై ప్రజాబ్యాలెట్ లో మార్కులు వేయించారు. ఈసందర్భంగా బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాబుకు తగిన బుద్ది చెబుతాం
విశాఖ(యలమంచిలి)) వైయస్ఆర్ సిపి యలమంచిలి నియోజకవర్గం కన్వీనర్ ప్రగడ నాగేశ్వరరావు పేటబయ్యవరం గ్రామంలో గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా గడపగడపలో బాబు మోసాలను ఎండగట్టారు. అధికారం కోసం బూటకపు హామీలిచ్చి తమను మోసం చేసిన బాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని గ్రామస్తులు హెచ్చరించారు. 

ప్రజాసమస్యలే పట్టడం లేదు
కర్నూలు)))శ్రీశైలం నియోజకవర్గ ఇంఛార్జ్ బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో బండిఆత్మకూరు మండలం, ఎర్నపాడులో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ప్రతీ గడపలో ఒకటే ఆవేదన. సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇళ్లు లేవు, ఉద్యోగం లేదు, భృతి లేదు, రుణాలు మాఫీ కాలేదని ప్రజలు వైయస్సార్సీపీ నేతల వద్ద మొరపెట్టుకుంటున్నారు. బాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా హామీలు అమలు చేయడం లేదని నేతలు మండిపడ్డారు. బాబు పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top