వైయస్సార్‌ సీపీలో 50 మంది చేరిక

చేవూరుపాలెం (కైకలూరు) :వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ముదినేపల్లి మండలం చేవూరుపాలెం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 చేరారు. ఆదివారం రాత్రి గడపగడపకూ వైయస్సార్‌ కార్యక్రమం సందర్భంగా హాజరైన పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) వద్ద వీరి అభిప్రాయం వ్యక్తం చేయగా ఆయన పార్టీ కండవాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న రోజుల్లో జగనన్న రాజ్యం వస్తుందని, వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. పార్టీ చేరికలో కీకల పాత్ర పోషించిన పార్టీ నాయకులు పరసా ఏసురాజు, ఆనందదాసు శివ నాగేంద్ర, పరసా శ్రీను, శొంఠి పాము, శొంఠి గోవింద్, గణేషుల చంద్రశేఖర్‌లను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిమ్మగడ్డ భిక్షాలు, పార్టీ జిల్లా కార్యదర్శి జాస్తి బాబు రాజేంద్రప్రసాద్, మండల పార్టీ కన్వీనరు బడుగు భాస్కరరావు, గడపగడపకూ కార్యక్రమ ఇన్‌ఛార్జీ కరాటే గోవిందురాజులు, మరీదు నాగయ్య, దాసరి శ్రీనివాసరావు, పాతూరి సీతారామాంజనేయులు పాల్గొన్నారు.

Back to Top