హోదా కోసం లోక్‌స‌భ‌లో ప్రైవేట్ బిల్లు

న్యూ ఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్ట‌నున్నారు. గ‌త లోక్‌స‌భ‌ బిజినెస్ లో 9వ ఐటమ్‌గా ఈ బిల్లు లిస్ట్ అయింది. అయితే అప్ప‌ట్లో స‌భా వాయిదా వేయ‌డంతో నిన్న‌టి నుంచి ప్రారంభ‌మైన బ‌డ్జెట్ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో తాజాగా మ‌రోమారు ప్రైవేట్ మెంబ‌ర్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి సిద్ధ‌మ‌య్యారు.


పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హ‌మీల‌పై సభలో ప‌ట్టుబ‌డ‌తామ‌ని, పోల‌వ‌రం, రైల్వే జోన్ స‌హా అన్ని అంశాల‌ను పార్లమెంట్‌లో లేవ‌నెత్తనున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్నారు. 
Back to Top