వైయస్‌ఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి

‌ఇడుపులపాయ, 2 సెప్టెంబర్ 2012 : మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మనకు దూరమై నేటికి సరిగ్గా మూడేళ్లు... మది నిండా ఆ జన నేత జ్ఞాపకాలే... గుండెలో చెరగని గురుతులు. వైయస్‌ఆర్ మూ‌డవ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని సమాధి వద్ద నివాళులు అర్పించారు. వైయస్ విజయమ్మ, వై‌యస్ భారతి, షర్మిల, వై‌యస్ వివేకానందరెడ్డి, బ్రద‌ర్ అనిల్‌కుమార్‌ ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయ వైయస్‌ఆర్‌ ఘాట్‌లో అంజలి ఘటించారు. గుండె లోతుల్లోంచి తన్నుకు వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ వారంతా మౌనంగా ఉండిపోయారు. మహానేతకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

Back to Top