వైఎస్సార్ కు ఘ‌న నివాళులు

దివంగ‌త మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి కుటుంబ స‌భ్యులు, అబిమానులు,
పార్టీ కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ప్ర‌తిప‌క్ష నేత,
వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న సతీమ‌ణి
భార‌తి, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌, బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌, విజ‌య‌మ్మ‌,
అవినాష్ రెడ్డి ఇత‌ర కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. ఇడుపుల పాయ‌లోని వైఎస్
స‌మాధి ద‌గ్గ‌ర ప్రార్థ‌న‌లు చేశారు. ఇత‌ర కుటుంబ స‌భ్యులు, బంధువులు,
మిత్రులు, అభిమానులు ఉద‌యం నుంచే అక్క‌డ‌కు చేరుకొన్నారు. ముందుగా వైఎస్
విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేశారు. అనంత‌రం స‌మాధి దగ్గ‌ర చాలా సేపు మౌనంగా
ఉండి వైఎస్ కు నివాళులు అర్పించారు.

Back to Top