నాలుగవ రోజు వైఎస్ జగన్ పర్యటన

వాకాడు : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూనే ఉన్నారు. కుండపోత వర్షాలతో తీవ్ర అవస్థలు పడుతున్న రైతులు, బాధితులను పరామర్శిస్తూ వారిలో భరోసా కల్పిస్తున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ఇళ్లను పరిశీలించారు. నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వారిలో వైఎస్ జగన్ ధైర్యం నింపుతున్నారు. 

నెల్లూరు జిల్లాలో నేడు నాలుగవ రోజు వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది.వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు అధైర్య పడొద్దని అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.  
Back to Top